లిఫ్ట్‌లలో అద్దాలు ఎందుకు ఉంటాయో తెలుసా?

  • ఇరుకైన ప్రదేశంలో ఎక్కువ స్థలం ఉన్నట్లు భ్రమ
  • సమయం త్వరగా గడిచినట్లు అనిపిస్తుంది
  • వెనుక ఉన్నవారి కదలికలను గమనించొచ్చు
  • వీల్ చైర్ వాడేవారు లిఫ్ట్ నుంచి సులభంగా బయటకు
మనం లిఫ్ట్ (ఎలివేటర్) ఎక్కగానే చాలామంది చేసే మొదటి పని.. అందులో ఉన్న అద్దం వంక చూసుకుని జుట్టు లేదా దుస్తులను సర్దుకోవడం. అయితే లిఫ్ట్‌లలో ఈ అద్దాలను ఏర్పాటు చేయడం వెనుక ఉన్న అసలు కారణం మన అందాన్ని చూసుకోవడానికి మాత్రం కాదు. చిన్న, కదిలే క్లోజ్డ్ స్పేస్‌లలో మనుషుల ప్రవర్తన, ఆలోచనలు ఎలా ఉంటాయో గమనించిన ఇంజనీర్లు, సైకాలజిస్టులు ఒక స్మార్ట్ డిజైన్ ట్రిక్‌గా ఈ అద్దాలను ఏర్పాటు చేశారు. ఆ ఆసక్తికరమైన కారణాలు ఇవే..

క్లాస్ట్రోఫోబియాను తగ్గిస్తుంది
కొంతమందికి ఇరుకైన ప్రదేశాల్లో ఉంటే ఊపిరాడనట్లు, భయంగా అనిపిస్తుంది. దీన్నే క్లాస్ట్రోఫోబియా అంటారు. అద్దాలు లోపలి భాగం చాలా పెద్దగా ఉన్నట్లు భ్రమ కల్పిస్తాయి. దీనివల్ల ప్రయాణికుల్లో ఉండే ఆందోళన తగ్గుతుంది.

సమయం త్వరగా గడిచిపోతుంది
అద్దం ఉంటే మనుషులు సహజంగానే తమని తాము చూసుకోవడంలో నిమగ్నమైపోతారు. ఇలా దృష్టి మళ్లించడం వల్ల బోర్ కొట్టదు. ప్రయాణ సమయం త్వరగా ముగిసినట్లు అనిపిస్తుంది.

భద్రత
లిఫ్ట్ లోపల రద్దీగా ఉన్నప్పుడు మన వెనుక ఎవరున్నారు? ఏం చేస్తున్నారనేది పదే పదే వెనక్కి తిరిగి చూడకుండానే అద్దం ద్వారా గమనించొచ్చు. ఇది దొంగతనాలు, వేధింపులు లేదా అనుమానాస్పద ప్రవర్తనలను అరికట్టడానికి సహాయపడుతుంది. మల్టిపుల్ యాంగిల్స్‌లో తాము కనిపిస్తున్నామనే భయం తప్పుడు పనులు చేసేవారిలోనూ ఉంటుంది.

వీల్ ఛైర్ వినియోగదారులకు
వీల్ ఛైర్ ఉపయోగించే వారికి ఈ అద్దాలు చాలా అవసరం. చిన్న లిఫ్ట్‌లలో వీల్ ఛైర్‌ను పూర్తిగా వెనక్కి తిప్పడం కష్టం. అలాంటప్పుడు లిఫ్ట్ ఆగి డోర్ తెరుచుకున్నప్పుడు వెనుక వైపు ఉన్న అద్దం సాయంతో వారు ఎలాంటి ప్రమాదం లేకుండా సురక్షితంగా రివర్స్‌లో బయటకు రావచ్చు. అంతర్జాతీయ యాక్సెసిబిలిటీ నిబంధనల ప్రకారం కూడా లిఫ్ట్‌లలో అద్దాలు తప్పనిసరి.

elevator
LIfts
Mirrors
Mirrors in Lifts

More Telugu News